ద్వేషభావంతో తిరస్కరించేవారు, దురవగాహనతో విశ్వసించేవారు – వీరిరువురూ తథాగతుని బోధనలను వక్రీకరిస్తారు. [అంగుత్తరనికాయ 2:22]
శీర్షికలు
శ్రద్ధ – ఆహా – అద్భుతం
బుద్ధుని బోధనల్లో “శ్రద్ధ” అనే భావన చాల కీలకమైంది. శ్రద్ధ అంటే ఆసక్తి, జాగ్రత్త, గౌరవం అనే అర్థాలు వాడుకలో ఉన్నాయి: శ్రద్ధగా వినటం అంటే, ఆసక్తితో జాగ్రత్తగా వినటం; శ్రద్ధాంజలి అంటే గౌరవంతో నమస్కరించటం. కాని, ధార్మిక విషయాల్లో “శ్రద్ధ” అంటే బలమైన ‘విశ్వాసం’ లేదా...
ఉద్వేగ ప్రవాహాలు
రచన: ఠానిస్సరో భిక్ఖు [2018లో వెలువడిన First Things First అనే సంకలనంలో గల The Streams of Emotion అనే వ్యాసానికి ఇది సరళ తెలుగు అనువాదం. ఇది బుద్ధుని బోధనలతో తగిన పరిచయం కలిగిన పాఠకులను ఉద్దేశించి రాసిన వ్యాసం అయినా, జీవితపు మౌలిక సమస్యల పరిష్కారం పట్ల గాఢమైన ఆసక్తి...
బుద్ధుని బోధనలు: మానవ విలువలు
రచన: డి. చంద్రశేఖర్ “బుద్ధుని బోధనలు: మానవ విలువలు” అనే విషయాన్ని లోతుగా పరిశీలించే ముందు, ‘మానవ విలువలు’ అనే మాటలకు సరైన నిర్వచనం చెప్పుకోవటం అవసరం. సాధారణంగా, మానవ విలువలు అంటే “ప్రత్యేకంగా మనిషి జీవితానికి...
కాలాములకు బుద్ధుని ఉపదేశం
రచన: మైఖేల్ కారిథెర్స్ [మైఖేల్ కారిథెర్స్ 1978లో, "The Forest Monks of Sri Lanka: Anthropological and Historical Study" అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను ఆక్సఫర్డ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. Oxford University వారు ప్రచురించిన Past Masters series లో భాగంగా,...
పరిపూర్ణ మానవతకు మార్గం!
ధర్మం అనే పదం చాల విలువైంది, దీని గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ధర్మం సర్వోన్నతమైంది అనే భావం చాలమందిలో ఉంది. ధర్మం గొప్పది, అత్యున్నతమైంది, అత్యంత విలువైందని అనుకోకపోతే, దాని గురించి ఇంత విస్తృతమైన చర్చ జరగదు.
స్వేచ్ఛాలోచన: భిన్నాభిప్రాయాలు
రచన: వల్పోల రాహుల [శ్రీలంకకు చెందిన బౌద్ధభిక్షువు మాననీయ వల్పోల రాహుల, 1933-34 మధ్య, సింహళ భాషలో కొన్ని వ్యాసాలు రాశారు. మొదట వాటిని కరపత్రాలుగా ప్రచురించి ఉచితంగా పంచారు. దాదాపు అరవై సంవత్సరాల తరువాత, 1992లో, అవి “సత్యోదయ” అనే పేరుతో ఒక సంకలనంగా వెలువడ్డాయి. మరో...