ముందుమాట

బుద్ధవచనం

ప్రాచీన బౌద్ధగ్రంథాల్లో బుద్ధుడు స్వయంగా బోధించాడని చెప్పబడిన ఉపదేశాలను బుద్ధవచనం అని పిలవటం పరిపాటి. ఈ గ్రంథాల్లో బుద్ధుని సమకాలిక శిష్యులు బోధించినవని చెప్పబడే ఉపదేశాలు, వ్యాఖ్యానాలు కూడ ఉన్నాయి. వీటిని కూడ బౌద్ధ సంప్రదాయం బుద్ధవచనంగానే పరిగణించింది. కనుక, బుద్ధవచనం అనే మాట బుద్ధుని మరియు ఆయన సమకాలిక శిష్యుల ఉపదేశాలను సూచిస్తుంది.

ఉద్దేశం

బుద్ధవచనాన్ని సుబోధకంగా అందించటానికి, దాన్ని జీవిత సమస్యల పరిష్కారానికి, దుఃఖ విముక్తికి ఆవశ్యకమైన ఒక సజీవ ధర్మంగా వివరించటానికి “బుద్ధవచనం” పత్రిక ఎంచుకున్న లక్ష్యాలు క్లుప్తంగా యివి:

  1. గౌతమ బుద్ధుని బోధనలను యథాతథంగా అందించినవని చెబుతున్న పాలి నికాయాలు, సంస్కృత ఆగమాలు తదితర మూల గ్రంథాల్లోని ప్రవచనాలను, సరళమైన తెలుగులో అందించటం.
    .
  2. గత రెండువేల సంవత్సరాలకు పైగా వివిధ బౌద్ధ యానాలు లేక శాఖలకు చెందిన పండితులు, బుద్ధవచనాన్ని విశ్లేషిస్తూ వ్యాఖ్యానిస్తూ వెలువరించిన రచనలను, మూల బుద్ధవచనం వెలుగులో వాటిని వివరించే రచనలను అందించటం.
    .
  3. గత నూటయాభై సంవత్సరాలుగా, ప్రపంచ వ్యాపితంగా అనేక మంది పండితులు, బుద్ధుని బోధనలను విశ్లేషిస్తూ, వివరిస్తూ, విమర్శిస్తూ వెలువరించిన రచనలను, వాటిని మూల బుద్ధవచనం వెలుగులో సరికొత్తగా విశ్లేషించే రచనలను అందించటం.
    .
  4. నేడు మానవుని జీవితాన్ని దుర్భరం చేస్తున్న సమస్యల మూలాలను, బుద్ధుని బోధనల వెలుగులో విశ్లేషిస్తూ, ఆ సమస్యల నివారణకు బౌద్ధం అందించే ఆచరణాత్మకమైన పరిష్కారాలను వివరించే రచనలను అందించటం.
    .
  5. పైన పేర్కొన్న వివిధ రకాల రచనల్లో, బుద్ధుని ప్రవచనాలతో సహా, ప్రకటించబడిన అభిప్రాయాలు వ్యాఖ్యలు విమర్శలపై అర్థవంతమైన చర్చకు, నిర్మాణాత్మకైన విమర్శకు తగిన వేదికను ఏర్పరచటం.

రచయితలకు సూచనలు

  1. రచనలు పైన ప్రకటించిన ఉద్దేశాలకు అనుగుణంగా ఉండాలి.
    .
  2. రచనలు సాధ్యమైనత సూటిగా, స్పష్టంగా, సంక్షిప్తంగా, ప్రామాణికత కలిగి ఉండాలి.
    .
  3. రచనలను Unicode Telugu Font లో టైపుచేసి
    • Word File రూపంలో పంపవచ్చు
    • Gmail మెసేజ్ గా టైపుచేసి పంపవచ్చు
      .
  4. మీ రచనల్లో సాధ్యమైన మేరకు మీరే తప్పులు దిద్ది పంపాలి.
    .
  5. మీ రచనలకు మీరే బాధ్యత వహించాలి. వాటిపై వచ్చే సందేహాలకు, విమర్శలకు సమాధానం యివ్వగలగాలి.
    .
  6. తమ ఫోను నంబరు పత్రికలో ప్రచురించటానికి సమ్మతించే రచయితలు, ఆ విషయాన్ని తెలియజెయ్యాలి.
    .
  7. “బుద్ధవచనం” మెరుగుదల కోసం మీ సలహాలు, సూచనలను మనసారా ఆహ్వానిస్తున్నాం.
    .
  8. రచనలు, సలహాలు, సూచనలు పంపవలసిన ID: editorbuddhavachanam@gmail.com