ధర్మాన్ని బోధించేవారికి బుద్ధుని ఉపదేశం

“ఇతరులకు ధర్మాన్ని బోధించటం సులువు కాదు. ఇతరులకు ధర్మాన్ని బోధించే వ్యక్తి, ముందుగా తనలో ఐదు గుణాలను సంతరించుకుని, (తరువాత) యితరులకు ధర్మాన్ని బోధించాలి. ఏమిటా ఐదు?

  1. ‘విషయాన్ని క్రమమైన పద్ధతిలో బోధిస్తాను’ అనే సంకల్పంతో యితరులకు ధర్మాన్ని బోధించాలి.
  2. ‘విషయం పట్ల లోతైన అవగాహన కోసం బోధిస్తాను’ అనే సంకల్పంతో యితరులకు ధర్మాన్ని బోధించాలి.
  3. ‘(వినేవారి పట్ల) సానుభూతితో బోధిస్తాను’ అనే సంకల్పంతో యితరులకు ధర్మాన్ని బోధించాలి.
  4. ‘నీచమైన ప్రయోజనాలను ఆశించి బోధించను’ అనే సంకల్పంతో యితరులకు ధర్మాన్ని బోధించాలి.
  5. ‘నాకు, యితరులకు హాని కలిగించని విధంగా బోధిస్తాను’ అనే సంకల్పంతో యితరులకు ధర్మాన్ని బోధించాలి.

ఇతరులకు ధర్మాన్ని బోధించటం సులువు కాదు. ఇతరులకు ధర్మాన్ని బోధించే వ్యక్తి, ముందుగా తనలో ఈ ఐదు గుణాలను సంతరించుకుని, (తరువాత) యితరులకు ధర్మాన్ని బోధించాలి.” [అంగుత్తరనికాయ 5:159]