ద్వేషభావంతో తిరస్కరించేవారు, దురవగాహనతో విశ్వసించేవారు – వీరిరువురూ తథాగతుని బోధనలను వక్రీకరిస్తారు. [అంగుత్తరనికాయ 2:22]

శీర్షికలు

శ్రద్ధ – ఆహా – అద్భుతం

శ్రద్ధ – ఆహా – అద్భుతం

బుద్ధుని బోధనల్లో “శ్రద్ధ” అనే భావన చాల కీలకమైంది. శ్రద్ధ అంటే ఆసక్తి, జాగ్రత్త, గౌరవం అనే అర్థాలు వాడుకలో ఉన్నాయి: శ్రద్ధగా వినటం అంటే, ఆసక్తితో జాగ్రత్తగా వినటం; శ్రద్ధాంజలి అంటే గౌరవంతో నమస్కరించటం. కాని, ధార్మిక విషయాల్లో “శ్రద్ధ” అంటే బలమైన ‘విశ్వాసం’ లేదా...

Read

ఉద్వేగ ప్రవాహాలు

ఉద్వేగ ప్రవాహాలు

రచన: ఠానిస్సరో భిక్ఖు [2018లో వెలువడిన First Things First అనే సంకలనంలో గల The Streams of Emotion అనే వ్యాసానికి ఇది సరళ తెలుగు అనువాదం. ఇది బుద్ధుని బోధనలతో తగిన పరిచయం కలిగిన పాఠకులను ఉద్దేశించి రాసిన వ్యాసం అయినా, జీవితపు మౌలిక సమస్యల పరిష్కారం పట్ల గాఢమైన ఆసక్తి...

Read

బుద్ధుని బోధనలు: మానవ విలువలు

బుద్ధుని బోధనలు: మానవ విలువలు

రచన: డి. చంద్రశేఖర్         “బుద్ధుని బోధనలు: మానవ విలువలు” అనే విషయాన్ని లోతుగా పరిశీలించే ముందు, ‘మానవ విలువలు’ అనే మాటలకు సరైన నిర్వచనం చెప్పుకోవటం అవసరం. సాధారణంగా, మానవ విలువలు అంటే “ప్రత్యేకంగా మనిషి జీవితానికి...

Read

కాలాములకు బుద్ధుని ఉపదేశం

కాలాములకు బుద్ధుని ఉపదేశం

రచన: మైఖేల్ కారిథెర్స్ [మైఖేల్ కారిథెర్స్ 1978లో, "The Forest Monks of Sri Lanka: Anthropological and Historical Study" అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను ఆక్సఫర్డ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. Oxford University వారు ప్రచురించిన Past Masters series లో భాగంగా,...

Read

పరిపూర్ణ మానవతకు మార్గం!

పరిపూర్ణ మానవతకు మార్గం!

ధర్మం అనే పదం చాల విలువైంది, దీని గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ధర్మం సర్వోన్నతమైంది అనే భావం చాలమందిలో ఉంది. ధర్మం గొప్పది, అత్యున్నతమైంది, అత్యంత విలువైందని అనుకోకపోతే, దాని గురించి ఇంత విస్తృతమైన చర్చ జరగదు.

Read

స్వేచ్ఛాలోచన: భిన్నాభిప్రాయాలు

స్వేచ్ఛాలోచన: భిన్నాభిప్రాయాలు

రచన: వల్పోల రాహుల [శ్రీలంకకు చెందిన బౌద్ధభిక్షువు మాననీయ వల్పోల రాహుల, 1933-34 మధ్య, సింహళ భాషలో కొన్ని వ్యాసాలు రాశారు. మొదట వాటిని కరపత్రాలుగా ప్రచురించి ఉచితంగా పంచారు. దాదాపు అరవై సంవత్సరాల తరువాత, 1992లో, అవి “సత్యోదయ” అనే పేరుతో ఒక సంకలనంగా వెలువడ్డాయి. మరో...

Read

చదవదగిన పుస్తకాలు

బుద్ధవచన ప్రామాణికత

మూల బౌద్ధగ్రంథాల్లో లభించే చారిత్రిక, తాత్విక, ధార్మిక విషయాల ఆధారంగా బుద్ధుని బోధనల ప్రామాణికతను లోతుగా చర్చించిన రచన ఇది. బౌద్ధ సాహిత్యంపై పాఠకులకు కలిగే అనేక ప్రశ్నలకు, సందేహాలకు దీనిలో సమాధానాలు లభిస్తాయి.

 

ప్రచురణ: పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్ పేజీలు : 144 – ధర: రూ.120

బుద్ధుని బోధనలపై విమర్శల పరామర్శ

 

“దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు! అంబేద్కరూ చాలడు! మార్క్స్ కావాలి!” అనే పుస్తకంలో రచయిత్రి రంగనాయకమ్మ బుద్ధుని బోధనలపై వెల్లడించిన విమర్శల పరామర్శ.

 

కాపీలు దొరుకు చోటు:

Arts & Letters, Hyderabad Ph: 9848337870

Dharmadeepam Foundation, Mangalagiri Ph:9032293121

పేజీలు : 56 – ధర: రూ.30

బుద్ధ ధర్మ సారం

The Essence of Buddhism అనే రచనకు అనువాదం.

బుద్ధుని ధర్మాన్ని ఆధునిక శాస్త్రవిజ్ఞాన, సామాజిక దృక్పథంతో లోతుగా విశ్లేషించిన రచన ఇది.

 

ప్రచురణ: పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్

పేజీలు : 144 – ధర: రూ.120

బుద్ధుని బోధనలు

 

What the Buddha Taught అనే రచనకు అనువాదం.

ప్రామాణిక బౌద్ధగ్రథాల ఆధారంగా, బుద్ధుని బోధనల్ని అత్యంత స్పష్టంగా, సమగ్రంగా, సరళమైన భాషలో పరిచయంచేసిన పుస్తకం ఇది.

 

ప్రచురణ: పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్

పేజీలు : 142 – ధర: రూ.110

ధర్మావరణం

బౌద్ధంలోని వివిధ అంశాలపై పత్రికల్లో వెలువడిన వ్యాసాల సంకలం. బుద్ధుని ధర్మాన్ని నిశిత దృష్టితో లోతుగా అవగాహన చేసుకోటానికి, బౌద్ధంపై వెల్లడైన విమర్శలను, దురభిప్రాయాలను సహేతుకంగా అర్థంచేసుకోటానికి అవసరమైన వ్యాసాలు దీనిలో ఉన్నాయి.

 

ప్రచురణ: పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్

పేజీలు : 136 – ధర: రూ.120

గౌతమ బుద్ధుడు

 

Buddha: A Very Short Introduction అనే పుస్తకానికి సరళ అనువాదం.

బుద్ధుని జీవితాన్ని, ఆయన బోధనల సారాంశాన్ని ఆధునిక దృష్టితో సంక్షిప్తంగా, లోతుగా, ప్రామాణికంగా వివరించిన పుస్తకం.

 

ప్రచురణ: పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్

పేజీలు : 96 – ధర: రూ.60

కాలామ సుత్తం

బుద్ధుని సొంత బోధనల సంకలనాలుగా చెప్పబడే పాలి నికాయాల నుండి ఎంపికచేసిన ఒక ఉపదేశానికి అనువాదం. ఒక విషయాన్ని సత్యంగా స్వీకరించటానికి లేదా నిరాకరించటానికి అవసరమైన ప్రాతిపదికను వివరించే ఉపదేశం ఇది.

 

ప్రచురణ: పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్

పేజీలు : 32 – ధర: రూ.20

బుద్ధధర్మ కరదీపిక

 

Handbook for Mankind అనే ఉపన్యాస సంకలనానికి అనువాదం. బుద్ధుని ధర్మంలోని మౌలిక విషయాలను సూటిగా, లోతుగా , ఆచరణాత్మకంగా వివరించే పుస్తకం ఇది.

ప్రచురణ: పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్

పేజీలు: 96 ధర: 75 రూ